ఎల్లారెడ్డిపేట, ఆగస్టు 31: తన కూతురు శారీ ఫంక్షన్ ఘనంగా చేయలేదని ఓ వివాహిత ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం గొల్లపల్లిలో జరిగింది. ఎస్ఐ రాహుల్‌రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గొల్లపల్లికి చెందిన ఎనుగందుల భాస్కర్‌కు సిరిసిల్లకు చెందిన లావణ్య(40)తో 2010లో వివాహం జరిగింది.
వారికి కూతురు సాన్వి, కొడుకు రిషిక్ ఉన్నా రు. ఇటీవల కూతురు శారీ ఫంక్షన్ ఘనంగా చేద్దామని లావణ్య తన భర్త భాస్కర్‌తో చెప్పగా నూతన గృహ ప్రవేశ కార్యక్రమం ఉన్నందున శారీ ఫంక్షన్ చిన్నగా చేశాడు. దీంతో మనస్తాపం చెం దిన లావణ్య కుటుంబసభ్యులతో మా ట్లాడటం మానేసింది. ఆదివారం సాయంత్రం బడి నుంచి వచ్చిన సాన్వీ, రిషిక్ తల్లిదండ్రులుంటున్న గదికి డోర్ వేసి ఉండడం చూసి పిలిచారు. స్పందన రాకపోవడంతో తండ్రికి సమాచారం ఇవ్వగా ఆయన వచ్చి బయట నుంచి అద్దం పగులగొట్టి చూడగా లావణ్య ఫ్యాన్‌కు ఉరేసుకుని కనిపించింది.