నారాయణపేట : భారీ వర్షానికి(Heavy rains) ఇల్లు కూలడంతో(House collapse) తల్లీకూతుళ్లు మృతి చెందిన ఘటన నారాయణపేట జిల్లా(Narayanapet district) కొత్తపల్లి మండలం ఎక్కమేడ్ గ్రామంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. ఎక్కమేడ్కు చెందిన హన్మమ్మకు ముగ్గురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. భర్త ఇటీవల చనిపోవడంతో రెండో కూతురు అంజిలమ్మతో కలిసి గ్రామంలోనే ఉంటున్నది. కుమారుడు, కోడలు మరో ఇంట్లో ఉంటున్నారు.
అయితే, భారీ వర్షాల కారణంగా ఇల్లు కూలడంతో హన్మమ్మ(60), ఆమె కూతురు అంజమ్మ(40) మృతి చెందారుMother and daughter died ). హన్మమ్మ,అంజమ్మ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, భారీ వర్షాల నేపపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలు బయటకి రావొద్దని అధికారులు హెచ్చరించారు. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఏ అవసరం వచ్చినా అధికారులకు ఫోన్లో సమాచారం ఇవ్వాలన్నారు. వర్షాల కారణంగా రేపు అన్ని విద్యా సంస్థలకు ప్రభుత్వం సెలవును ప్రకటించింది.