చేగుంట, ఆగస్టు 14 : ఒంటరితనం, పక్కవారి నుంచి పలుకరింపులు లేకపోవడంతో మనస్తాపంతో తల్లీకూతురు ఆత్మహత్య చేసుకు న్న విషాదకర ఘట న మెదక్ జిల్లా చేగుంట మండలం రెడ్డిపల్లిలో బుధవారం వెలుగుచూసింది. స్థానికులు, చేగుంట పోలీసుల కథనం ప్రకా రం.. రెడ్డిపల్లికి చెందిన తలారి ఎల్లవ్వ (70), పోచవ్వ(50) తల్లీకూతుళ్లు. మక్కరాజిపేటకు చెందిన లావణ్యకు రెడ్డిపల్లి వాసి తలారి ముత్యంతో వివాహం జరగ్గా.. కుటుంబ కలహాలతో ఆరు నెలల క్రితం బావిలో పడి లావణ్య అనుమానాస్పద స్థితిలో మృతిచెందింది. లావణ్య మృతికి భర్త, అత్త, ఆడపడుచు కారణమంటూ మృతురాలి బంధువుల ఫిర్యా దు చేశారు. ఈ మేరకు భర్త ముత్యం, అత్త తలారి ఎల్లవ్వ, ఆడపడుచు తలారి పోచవ్వపై కేసు నమోదైంది.
దీంతోపాటు వారికి ఉన్న కొద్దిపాటి వ్యవసాయ భూమి ని లావణ్య తల్లి పేరిట రిజిస్ట్రేషన్ చేయించే వరకు మూడు రోజులపాటు మృతదేహానికి దహన సంస్కారాలు జరగనివ్వలేదు. జైలు నుంచి వచ్చిన ముత్యం బతుకుదెరువు కోసం తన పిల్లలతో కలిసి హైదరాబాద్‌లో ఉంటున్నా డు. తలారి ఎల్లవ్వ, ఆమె కూతురు పోచ వ్వ మాత్రం రెడ్డిపల్లిలోని ఇంట్లోనే ఉం టున్నారు. ఇరుగుపొరుగు వారు వీరితో మాట్లాడటం లేదు. ఒంటరితనం భరించలేక తీవ్ర మనోవేదనకు గురైన తల్లీకూతురు మంగళవారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ముత్యం ఫిర్యాదు మేరకు చేగుంట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
మణికొండ, ఆగస్టు 14: ఓ వ్యక్తిని గడ్డం గీసే కత్తితో గొంతుకోసి హత్య చేసిన నిందితుడు పోలీసులకు లొంగిపోయిన నార్సింగి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. నార్సింగి సీఐ హరికృష్ణరెడ్డి తెలిపిన ప్రకారం.. నార్సింగి కుమ్మరి బస్తీకి చెందిన కొండ రాజు (48) సెలూన్‌ను నిర్వహిస్తున్నాడు. రాజుకు భార్య వరలక్ష్మి, ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇదే ప్రాంతంలోని సమీప బంధువైన ప్రవీణ్‌కుమార్‌తో రాజుకు కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. డిసెంబర్ 31న తమ ఇంటి ఎదుట ముగ్గులు చెరిపేశాడని ప్రవీణ్‌తో గొడవపడి, నార్సింగి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదులు చేసుకున్నారు. దీంతో రాజుపై కక్ష పెంచుకున్న ప్రవీణ్ మంగళవారం అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి రాజును గడ్డం చేసే కత్తితో గొంతుకోసి హత్య చేశాడు. బుధవారం ఉదయం నార్సింగి పోలీస్‌స్టేషన్‌కు వచ్చి లొంగిపోయాడు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.