నీలగిరి, జూలై 27. ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన యువకుడి కోసం ఓ తల్లి చిన్నారిని వదిలేసింది. నల్లగొండలోని పాతబస్తీకి చెందిన ఒక యువకుడికి హైదరాబాద్‌కు చెందిన నవీనతో ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైంది. సదరు మహిళ భర్తను, 15 నెలల పిల్లాడిని వదిలేసి ప్రియుడితో వెళ్లేందుకు ప్లాన్ వేసింది. ఆదివారం నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్‌కు బాబుతోపాటు వచ్చింది. అప్పటికే అక్కడ వేచియున్న ప్రియుడిని చూసి బాబును బస్టాండ్‌లోనే వదిలేసి అతడి బైక్‌పై వెళ్లిపోయింది. బాలుడు తల్లి కోసం ఏడవడం చూసిన డిపో సిబ్బంది నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు. టూటౌన్ ఎస్సై సైదులు స్పందించి సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్‌కు పంపారు. పోలీసులు బస్టాండ్‌లోని సీసీ కెమెరా ఫుటేజీని పరిశీలించి బైక్ మీద వెళ్తున్న మహిళను గుర్తించారు. బైక్ నంబర్ ప్లేట్ ఆధారంగా విచారణ చేపట్టిన పోలీసులు మహిళతోపాటు ప్రియుడిని పట్టుకున్నారు. అనంతరం ఆమె భర్తను స్టేషన్‌కు పిలిపించి పిల్లాడిని అప్పగించారు.
తొమ్మిదేండ్ల కూతురిపై తండ్రి అఘాయిత్యం ; పూసలపాడులో జాతీయ తల్లిదండ్రుల దినోత్సవంరోజు అమానవీయ ఘటన
మరికల్, జూలై 27 : నారాయణపేట జిల్లా మరికల్ మండలం పూసలపాడులో జాతీయ తల్లిదండ్రుల దినోత్సవం రోజు కూతురిపై కన్న తండ్రి అఘాయిత్యం చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పూసలపాడు గ్రామానికి చెందిన ఓ వ్యక్తికి ముగ్గురు కూమార్తెలు ఉన్నారు. వారిలో ఇద్దరు మక్తల్ మండలంలోని గురుకుల పాఠశాలలో చదువుతున్నారు. చిన్న కుమార్తె గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఐదో తరగతి చదువుతున్నది. ఈ నెల 25న సాయంత్రం తన తొమ్మిదేండ్ల కూతురిపై ఇంట్లో ఎవరూలేని సమయంలో తాగినమైకంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లితో కూతురు జరిగిన విషయం తెలిపింది. కూతురుకు అధికరక్తస్రావం కావడంతో తల్లి శనివారం ఉదయం మహబూబ్‌నగర్ ప్రైవేట్ దవాఖానకు తరలించగా జరిగిన ఘటనపై వైద్యులు ఆరాతీసి ప్రభుత్వ దవాఖానకు తరలించారు. రక్తస్రావం ఆగకపోవడంతో మహబూబ్‌నగర్ జిల్లా దవాఖాన నుంచి హైదరాబాద్‌కు తరలించినట్టు తెలిసింది. ప్రస్తుతం పరారీలో ఉన్న నిందితుడి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు తెలిసింది.