Sriramsagar Project | తెలంగాణ జీవధార శ్రీరాంసాగర్ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతాల నుంచి వరద వచ్చి చేరుతున్నది. దాంతో పాటు ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రస్తుతం ప్రాజెక్టుకు 59,165 క్యూసెక్కుల వరద వస్తున్నది. ఎస్సారెస్పీ పూర్తిస్థాయి నీటిమట్టం 1091 అడుగులు. ప్రస్తుతం ప్రాజెక్టులో 1073.6 అడుగుల నీరున్నది. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 90.3 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం జలాశయంలో 36.52 టీఎంసీల నీరు నిల్వ ఉన్నది.