హైదరాబాద్: సింగరేణిని జలగలా రక్తం పీల్చేందుకు మోదీ కుయుక్తులు చేస్తున్నారని సీపీఐ నేత నారాయణ విమర్శించారు. సింగరేణిలో 51 శాతం వాటా రాష్ట్ర ప్రభుత్వానిదేని అయితే బ్లాక్‌ల కేటాయింపు అధికారం కేంద్రం చేతిలోనే ఉందన్నారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. సింగరేణి గనుల చుట్టు బొగ్గు బ్లాక్‌లను ప్రైవేట్‌కు కట్టబెడుతున్నారని చెప్పారు. క్రమంగా సింగరేణి సంస్థను చంపేయడమే ప్రధాని మోదీ లక్ష్యమని వెల్లడించారు.
ఇప్పటికే దేశవ్యాప్తంగా 90 కంటే ఎక్కువ బొగ్గు బ్లాక్‌లను అమ్మేశారని తెలిపారు. అదానీ, అంబానీలకు గనులు కట్టబెట్టేందుకు మోదీ కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. అవినీతి పరులను కాపాడుతున్నది ప్రధాని మోదీయేనని చెప్పారు.