హైదరాబాద్, మే 9 (నమస్తే తెలంగాణ) : ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 80కి పైగా ప్రిన్సిపల్ పోస్టులను పదోన్నతులతో తక్షణమే భర్తీ చేయాలని తెలంగాణ ఇంటర్మీడియట్ గవర్నమెంట్ లెక్చరర్స్ అసోసియేషన్ (టిగ్లా) ప్రభుత్వాన్ని కోరింది. డైరెక్టర్ కార్యాలయంలో అడిషనల్ డైరెక్టర్ పోస్టు, 26 జిల్లాలకు జిల్లా ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ పోస్టులను మంజూరుచేయాలని విజ్ఞప్తిచేసింది.
శుక్రవారం టిగ్లా వ్యవస్థాపక అధ్యక్షుడు మాచర్ల రామకృష్ణగౌడ్, అధ్యక్షుడు జంగయ్య, ప్రధాన కార్యదర్శి ఎస్కే నయీం పాషా ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నియమించిన అధికారులు కమిటీ చైర్మన్ నవీన్ మిట్టల్‌ను కలిసి వినతిపత్రం సమర్పించారు.