హైదరాబాద్, జూలై 20 (నమస్తే తెలంగాణ) : వరద ప్రభావిత ప్రాం తాల్లో తాగునీటి సరఫరాపై మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని మిషన్ భగీరథ కార్యదర్శి స్మితా సభర్వాల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. డబుల్ క్లోరినేషన్తో పాటు నీటి నాణ్యత పరీక్షల శాంపిల్స్‌ను పెంచాలని సూచించారు. బుధవారం నగరంలోని ఎర్రమంజిల్‌లో మిషన్ భగీరథ ప్ర ధాన కార్యాలయం నుంచి గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సరఫరా స్థితిపై చీఫ్ ఇంజినీర్లు, అన్ని జిల్లాల ఎస్ఈ, ఈఈ, డీఈఈ లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భారీ వర్షాలు, వాతావరణ మార్పులతో తాగునీరు కలుషితం అయ్యే అవకాశం ఉన్నదన్నారు. అందువల్ల తాగునీటి స్వచ్ఛతను కాపాడాలని తెలిపారు.ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఈఎన్సీ కృపాకర్ రెడ్డి, ప్రభుత్వ సలహాదారుడు జ్ఞానేశ్వర్, చీఫ్ ఇంజినీర్లు వినోభాదేవి, శ్రీనివాస్, మధుబాబు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.