హైదరాబాద్ : అతి త్వరలోనే రాష్ట్రంలోని ప్రతి గీతవృత్తిదారుడికి మోపెడ్ బైక్‌ను అందజేస్తామని రాష్ట్ర ఆబ్కారీశాఖ మంత్రి వి. శ్రీనివాస్‌గౌడ్ తెలిపారు. కల్లుగీత వృత్తి రక్షణకు, గీతకార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఆయన పేర్కొన్నారు. ఈ నెల 16న నగరంలోని చిక్కడపల్లిలో తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న సర్ధార్ సర్వాయి పాపన్నగౌడ్ 371వ జయంతి ఉత్సవాల పోస్టర్‌ను మంత్రి గురువారం ఉదయం మినిస్టర్ క్వార్టర్స్‌లోని తన అధికారిక నివాసంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ నాయకులతో మంత్రి మాట్లాడారు. పోస్టర్ ఆవిష్కరణలో తెలంగాణ గౌడ, కల్లుగీత సంఘాల సమన్వయ కమిటీ ఛైర్మన్ బాలగోని బాలరాజుగౌడ్, రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్, వర్కింగ్ ఛైర్మన్ యెలికట్టె విజయ్‌కుమార్ గౌడ్, కో-ఆర్డినేటర్ సింగం సత్తయ్యగౌడ్, వైస్‌ఛైర్మన్ గడ్డమీది విజయ్‌కుమార్ గౌడ్, సత్యనారాయణ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, తదితరులు పాల్గొన్నారు.