Monkey Died | కోతుల మృతి కలకలం సృష్టించింది. తాగునీటి ట్యాంకులో కోతుల కళేబరాలు వెలుగు చూశాయి. ఈ ఘటన నల్లగొండ జిల్లా నాగార్జున సాగర్ పరిధిలోని నందికొండ మున్సిపాలిటీలో చోటు చేసుకున్నది. వివరాల్లోకి వెళితే.. ఒకటో వార్డు పరిధిలోని విజయ విహార్ పక్కనే ఉన్న వాటర్ ట్యాంకులో 40 వరకు కోతుల కళేబరాలను గుర్తించారు. గత కొద్దిరోజులుగా ఇదే ట్యాంకు మంచినీటి సరఫరా జరుగుతున్నది. ఎన్ఎస్పీ అధికారులు సరఫరా చేసిన నాటినే జనం తాగుతూ వస్తున్నారు. తాజాగా కోతుల కళేబరాలు వెలుగు చూడడంతో స్థానికులు ఆందోళనకు గురవుతున్నారు.
అయితే, వాటర్ ట్యాంకులపై రేకుల మూత ఉన్నది. తెరిచి ఉండడంతో కోతులు అందులో నీటిని తాగేందుకు వెళ్లినట్లుగా అనుమానిస్తున్నారు. నీళ్ల కోసం ట్యాంకులోకి వెళ్లి.. తిరిగి రాలేక అందులోనే పడిపోయి ఉంటాయని భావిస్తున్నారు. దాదాపు 30 నుంచి 40 వరకు కోతుల కళేబరాలు ఉన్నట్లుగా తెలుస్తున్నది. వాటిని బయటకు తీసేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారు. అదే ప్రాంతంలో ఉన్న కోతులు స్థానికులపైకి దాడికి ప్రయత్నిస్తున్నాయి. అధికారుల తీరుపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
నల్లగొండ జిల్లాలో ఘోరం!
బాధ్యత లేని అధికారులు.. రాజకీయం తప్ప ప్రజల ప్రాణాలు లెక్కలేని ప్రభుత్వం.
కోతులు చనిపోయిన నీళ్లను ప్రజలు తాగడానికి సరఫరా చేశారు.
నందికొండ మున్సిపాలిటీ ఒకటవ వార్డు పరిధిలో విజయ విహార్ పక్కన ఉన్న వాటర్ ట్యాంక్లో కోతుల కళేబరాలు.
అవే నీటిని గత కొన్ని… pic.twitter.com/MJvuevTlN5
— Telugu Scribe (@TeluguScribe) April 3, 2024