మంకీపాక్స్‌పై అప్రమత్తం.. 12 దేశాల నుంచి వస్తే 21 రోజుల ఐసొలేషన్
- డీఎంహెచ్‌వోలకు రాష్ట్ర వైద్యశాఖ ఆదేశాలు
- టెస్టింగ్, ట్రేసింగ్, ట్రీట్మెంట్పై మార్గదర్శకాలు
హైదరాబాద్, మే 28 (నమస్తే తెలంగాణ): దాదాపు 12 దేశాల్లో మంకీపాక్స్ కలకలం సృష్టిస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం (ఎన్సీడీసీ) సూచనల మేరకు జిల్లా వైద్యాధికారులను (డీఎంహెచ్‌వో) అప్రమత్తం చేస్తూ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు ఆదేశాలు జారీచేశారు. మంకీపాక్స్ లక్షణాలు, బాధితుల గుర్తింపు, చికిత్సపై స్పష్టమైన మార్గదర్శకాలు ఇచ్చారు. అన్ని దవాఖానల్లో చికిత్సకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని ఆదేశించారు.
మంకీ పాక్స్ లక్షణాలు: జ్వరం, తీవ్రమైన దద్దుర్లు, చర్మంపై బుడగలు వంటివి ఏర్పడటం.
అనుమానితులు ఎవరంటే..?: అకస్మాత్తుగా తీవ్రమైన దద్దుర్లు వచ్చినవారు, మంకీపాక్స్ కేసులు నమోదవుతున్న దేశాల నుంచి గత 21 రోజుల్లో వచ్చినవారు, మంకీపాక్స్ సోకినవారితో సన్నిహితంగా మెలిగినవారు.
చికిత్స: అనుమానిత లక్షణాలు ఉన్నవారిని వెంటనే దవాఖానలో చేర్చి ఐసొలేషన్‌లో ఉంచాలి. చర్మంపై బుడగలు తొలిగిపోయి, పైపొర పూర్తిగా ఊడిపోయి, కొత్త పొర ఏర్పడే వరకు చికిత్స అందించాలి. ఇతరులకు సోకకుండా అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలి.
వైద్య సిబ్బందికి మార్గదర్శకాలు
- పరీక్షల నిమిత్తం ఉమ్మి, రక్తం, రక్తనాళాల్లోని ఇతర ద్రవాల శాంపిళ్లను సేకరించి పూణెలోని ఎన్ఐవీకి పంపాల్సి ఉంటుంది.
- అనుమానితుల వివరాలను ఎప్పటికప్పుడు జిల్లా నిఘా అధికారి లేదా ఇంటిగ్రేటెడ్ డిసీజ్ సర్వైలెన్స్ ప్రోగ్రాం అధికారికి సమాచారం ఇవ్వాలి.
- ఒకవేళ పాజిటివ్ కేసు నమోదైతే కాంట్రాక్ట్ ట్రేసింగ్ చేయాలి. బాధితులు గత 21 రోజుల్లో ఎవరెవరితో సన్నిహితంగా మెలిగారో గుర్తించి వారిని ఐసొలేట్ చేయాలి.
భయం వద్దు
మంకీపాక్స్ గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన పని లేదని ఎన్సీడీసీ ఇటీవల విడుదల చేసిన మార్గదర్శకాల్లో పేర్కొన్నది. లక్షణాలు 2-4 వారాల్లో తగ్గిపోతాయని తెలిపింది. అరుదైన సందర్భాల్లో మాత్రమే తీవ్రత పెరుగుతుందని చెప్పింది. మరణాల రేటు 1-10 శాతం మధ్య ఉండొచ్చని అంచనా వేసింది.
ఈ వైరస్ జంతువు నుంచి మనిషికి, మనిషి నుంచి మనిషికి సోకుతుంది.
- స్వలింగ సంపర్కుల్లో ఈ వ్యాధి ఎక్కువగా సోకుతున్నట్టు డబ్ల్యూహెచ్‌వో తెలిపింది.
- చర్మం నుంచి వెలువడే ద్రవాలు, తుంపర్లు, కండ్లు, ముక్కు, నోటి నుంచి వచ్చే ద్రవాల ద్వారా ఒకరి నుంచి మరొకరికి సోకే అవకాశం ఉన్నది. బాధితులు తాకిన వస్తువుల ద్వారా కూడా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్నది.
- ఎలుకలు, ఉడుతలు, పెంపుడు జంతువుల ద్వారా ఎక్కువగా వ్యాపిస్తుంది. వైరస్ సోకిన జంతువులు కరిచినప్పుడు మనుషులకు సోకే అవకాశం ఉంటుంది.
- 7-14 రోజులు ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది. 5-21 రోజుల్లో లక్షణాలు బయటపడుతాయి.
- అమ్మవారు (స్మాల్‌పాక్స్) సోకినప్పుడు చేసే చికిత్సనే మంకీపాక్స్‌కు అందిస్తారు. స్మాల్‌పాక్స్ ఔషధాలు 85 శాతం ప్రభావాన్ని చూపుతున్నట్టు అధ్యయనాలు చెప్తున్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

