కోనరావుపేట, ఫిబ్రవరి 2: పెండ్లయిన ఏడాది తర్వాత కల్యాణలక్ష్మి చెక్కు రావడం తో ఆ లబ్ధిదారు మురిసిపోయింది. వెంటనే బ్యాంకులో చెక్కు డిపాజిట్ చేసింది. తీరా పదిరోజులకు బ్యాంకు మేనేజర్ ఫోన్ చేసి ‘మీ చెక్కుకు కాలంచెల్లింది.. తిరిగి తీసుకెళ్లి కొత్తది తీసుకురావాలి’ అని ఫోన్ చేసి చెప్పడంతో ఆమె షాక్‌కు గురైంది. ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోవడం లేదు.
రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండ లం ధర్మారం గ్రామానికి చెందిన నేరెళ్ల పద్మ తన కూతురు రేవతికి ఏడాది క్రితం పెండ్లి చే సింది. కల్యాణలక్ష్మి కోసం దరఖాస్తు చేయగా ప్రభుత్వం రూ.1,00,116 చెక్కు మంజూరుచేసింది. గత జనవరి 20న ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ధర్మారంలో మండలానికి చెందిన 106 చెక్కులను ఇవ్వగా, పద్మ కూడా అందుకున్నది. ఈ చెక్కు వ్యాలిడిటీ జనవరి 29వర కు ఉన్నది. పద్మ చెక్కును జనవరి 21న కోనరావుపేట కేడీసీసీబీలో డిపాజిట్ చేసింది.
27న బ్యాంకుకు వెళ్లగా, అసిస్టెంట్ బ్యాంక్ మేనేజర్ వారంలోగా జమవుతాయని చెప్పి పంపారు. 30న పద్మకు మేనేజర్ దేవరాజు ఫోన్ చేసి చెక్కు గడువు ముగిసిందని, తహసీల్ కార్యాలయంలో చెక్కును మార్పు చేసి తీసుకురావాలని చెప్పారు. తహసీల్దార్‌ను అ డిగితే గడువులోపు చెక్కులు పంపిణీ చేశా మ ని చెప్పారు. బ్యాంక్ మేనేజర్ నిర్లక్ష్యంతోనే చెక్కు కాలం చెల్లిందని పద్మ ఆవేదన వ్యక్తం చేసిం ది. అధికారులు కొత్త చెకు ఇచ్చి నగదు వచ్చేలా చూడాలని వేడుకుంటున్నది.