హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ) : మంచు కుటుంబంపై పహాడీషరీఫ్ ఠాణాలో మూడు కేసులు నమోదయ్యాయని రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్‌బాబు వెల్లడించారు. ఆయన వద్ద ఉన్న రెండు తుపాకులలో ఒకటి ఏపీలోని చంద్రగిరి ఠాణాలో సరెండర్ చేయగా స్పానిష్ మోడల్‌కు చెందిన మరో గన్ ఆయ న లాకర్లో ఉందని తెలిపారు. సోమవారం డ్రగ్స్ ముఠా అరెస్ట్ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంచు కుటుంబ వివాదంపై విలేకరులు అడిగిన ప్ర శ్నలకు సీపీ సమాధానం చెప్పారు. మంచు మోహన్‌బాబు, ఆయన కుమారుల మధ్య వివాదానికి సంబంధించిన ఫిర్యాదులపై కేసులు నమోదు చేశామని తెలిపారు. నోటీసులు ఇచ్చి కమిషనర్ కార్యాలయానికి రా వాలని మోహన్‌బాబుకు సూచించామని, ఆయన హాజరుపై హైకోర్టు 24వరకు మినహాయింపు ఇచ్చిందని చెప్పారు. కోర్టు తదుపరి నిర్ణయం ఆధారంగా చర్యలుంటాయని తెలిపారు. అవసరమైతే మరో నోటీసులు ఇస్తామని, అప్పుడు కూడా స్పందిచకుంటే వారెంట్ జారీ చేస్తామని స్పష్టంచేశారు.