హైదరాబాద్, ఏప్రిల్ 15 (నమస్తే తెలంగాణ): సినీనటుడు మోహన్‌బాబు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2019లో నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసు కొట్టేయాలని ఆయన సుప్రీంకోర్టులో మంగళవారం పిటిషన్ వేశారు. 2019 ఎన్నికల సమయంలో కోడ్ అమలులో ఉండగా, ఫీజు రీయింబర్స్మెంట్ కోసం తన యూనివర్సిటీ విద్యార్థులతో మోహన్‌బాబు కలిసి తిరుపతిలో భారీ ఆందోళన చేపట్టారు. దీంతో మోహన్‌బాబుపై ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద అప్పటి ఎన్నికల అధికారిగా ఉన్న కే హేమలత కేసు నమోదు చేశారు.