హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఎనిమిది స్థానాలు గెలుచుకోవడం పట్ల ప్రధాని నరేంద్రమోదీ హర్షం వ్యక్తం చేశారు. తమకు మద్దతు పలికిన తెలంగాణ ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. ‘కొన్నేండ్లుగా మాకు మీ మద్దతు పెరుగుతున్నది. ఈ సరళి రాబోయే కాలంలోనూ కొనసాగుతుంది. తెలంగాణతో మా బంధం విడదీయరానిది. ప్రజల కోసం మేం పనిచేస్తూనే ఉంటాం. ప్రతి బీజేపీ కార్యకర్త చేసిన అపార కృషిని నేను అభినందిస్తున్నాను’ అని మోదీ ట్వీట్ చేశారు.