హైదరాబాద్: ప్రధాని మోదీ నేడు హైదరాబాద్‌కు రానున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వివక్షకు వ్యతిరేకంగా ప్రధాని మోదీని ప్రశ్నిస్తూ నగర యువత బ్యానర్లు ఏర్పాటు చేశారు. తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీ ఎందుకు మంజూరు చేయలేదు, విభజన చట్టం ప్రకారం ఇస్తామన్న కోచ్ ఫ్యాక్టరీ ఏమైంది అంటూ మొత్తం 17 ప్రశ్నలతో 17 చోట్ల బ్యానర్లు కట్టారు.
17 ప్రశ్నలు..
1. మోదీజీ.. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక్క మెడికల్ కాలేజీని కూడా ఎందుకు మంజూరు చేయలేదు?
2. తెలంగాణలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రిసెర్చ్ ఎక్కడ ఉంది?
3. తెలంగాణకు డిఫెన్స్ కారిడార్ ఎందుకు మంజూరు చేయలేదు?
4. కాలేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వలేదు?
5. పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎక్కడ?
6. కాజీపేట రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఏది?
7. గ్లోబల్ సెంటర్ ఫర్ ట్రెడిషనల్ మెడిసిన్‌ను హైదరాబాద్ నుంచి గుజరాత్‌కు ఎందుకు తరలించారు?
8. తెలంగాణకు కొత్తగా నవోదయ విద్యాలయాలను ఎందుకు మంజూరు చేయడంలేదు?
9. నిజామాబాద్‌లో పసుపు బోర్డును ఎందుకు ఏర్పాటు చేయలేదు?
10. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎక్కడ?11. తెలంగాణకు ఐటీఐఆర్ ఎక్కడ?
12. తెలంగాణకు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ ఏది?
13. నీతి ఆయోగ్ చెప్పినప్పటికీ మిషన్ భగీరథకు నిధులు ఎందుకు ఇవ్వలేదు?
14. హైదరాబాద్‌కు వరద సాయం ఎందుకు చేయలేదు?
15. తెలంగాణకు మెగా పవర్లూమ్ టెక్స్టైల్ క్లస్టర్ ఒక్కటికూడా ఎందుకు మంజూరు చేయలేదు?
16. ఫార్మాసిటీకి ఆర్థిక సాయం ఏమైనా చేశారా?
17. తెలంగాణకు ఐఐఎం ఎక్కడ?