హైదరాబాద్, ఫిబ్రవరి 23 (నమస్తే తెలంగాణ): ప్రధాని మోదీ కార్పొరేట్ల చేతిలో బం దీగా మారారని సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. దేశంలో అదానీ, అంబానీ పాలన సాగుతున్నదని మండిపడ్డారు. హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేం ద్రంలో గురువారం ప్రారంభమైన అఖిల భారత ఫార్వర్డ్‌బ్లాక్ 19వ జాతీయ మహాసభల్లో నారాయణ ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. మోదీ అసమర్థ విధానాలతో దేశ ఆర్థిక వ్యవస్థ రోజురోజుకూ పతనమవుతున్నదని మండిపడ్డారు.
మోదీ-అమిత్‌షా ద్వ యం పాలనలో దేశం ప్రమాదంలో కూరుకుపోతున్నదని, ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకంగా మారిందని ఆందోళన వ్యక్తంచేశారు. మతాల పేరుతో ఎప్పుడు ఎక్కడ ఏం జరుగుతుందో, కులం పేరుతో ఎక్కడ ఎవరిని చంపేస్తారోనని ప్రజలు నిత్యం భయపడుతూ బతకాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తంచేశారు. కమ్యూనిస్టులు ఏకం కావాల్సిన సమయం ఆసన్నమైనదని చెప్పారు. సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యురాలు సుభాషిణి అలీ మాట్లాడుతూ.. 2024లో దేశంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే ప్ర జాస్వామ్య మనుగడకే ప్రమాదమని హెచ్చరించారు. మహాసభలకు 600 మంది వివిధ రాష్ర్టాల ప్రతినిధులు హాజరయ్యారు. తొలుత బాగ్‌లింగంపల్లిలో ప్రదర్శన నిర్వహించారు.