హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ): ఉద్యోగాల భర్తీపై ప్రధాని మోదీకి చిత్తశుద్ధి లేదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ మండిపడ్డారు. రైల్వేశాఖలో వివిధ క్యాటగిరీల్లో ఖాళీగా ఉన్న 3,15,823 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్‌చేశారు. కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ రాజ్యసభలో వెల్లడించిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలోనే 17,134 ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయన్నారు. తెలంగాణ నలుగురు బీజేపీ ఎంపీలు రైల్వే ఉద్యోగాల భర్తీ కోసం ఎందుకు మాట్లడటం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలోని నిరుద్యోగ యువత గురించి ఆలోచించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం వివిధశాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదలచేస్తున్నదని గుర్తుచేశారు. కేంద్రం కూడా రైల్వేతోపా టు వివిధశాఖల్లో ఉద్యోగాల భర్తీ కోసం చ ర్యలు తీసుకోవాలని కోరారు. ఎన్నికల హా మీని మోదీ నెరవేర్చాలని డిమాండ్‌చేశారు.