హైదరాబాద్, అక్టోబర్ 1(నమస్తే తెలంగాణ): పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఉత్తర-వాయువ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారే అవకాశం ఉన్నదని హైదరాబాద్ వాతావరణ కేం ద్రం బుధవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ వాయుగుండం శుక్రవారం తెల్లవారుజామున గోపాల్పూర్-పారాదీప్ మధ్య తీరం దాటే అవకాశమున్నదని పేర్కొన్నది. దీనిప్రభావంతో రాష్ట్రంలో నాలుగురోజులపాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది.