హైదరాబాద్, ఆగస్టు 28 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో గురువారం అల్పపీడనం ఏర్పడే అవకాశమున్నదని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో ఈ నెల 30 నుంచి 2వ తేదీ వరకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురువచ్చని అంచనా వేసింది.
పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం,ఆసిఫాబాద్, మంచిర్యాల, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ,సిద్దిపేట జిల్లాల్లో వర్షా లు పడొచ్చని పేర్కొన్నది. ఆయా జిల్లాలకు ఎల్లో, ఆరెంజ్ అలర్ట్‌ను జారీ చేసింది.