హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ): మాడల్ స్కూల్స్ టీచర్లకు 010 పద్దు ద్వారా వేతనాలివ్వాలని తెలంగాణ మాడల్ స్కూల్ టీచర్స్ అసోసియేషన్(టీఎంఎస్టీఏ) ప్రభుత్వాన్ని కోరింది. శుక్రవారం రాష్ట్ర అధ్యక్షుడు భూతం యాకమల్లు, అసోసియేట్ అధ్యక్షుడు సిలువేరు స్వామి సచివాలయంలో విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశంను కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు.
దశలవారీగా ఆందోళనలు: పీఎంటీఏ టీఎస్
హైదరాబాద్, నవంబర్ 22 (నమస్తే తెలంగాణ) : మాడల్ స్కూల్ టీచర్ల సమస్యలను 15 రోజుల్లో పరిష్కరించకుంటే దశలవారీగా ఆందోళనలకు దిగుతామని ఉపాధ్యాయ సంఘాలు హెచ్చరించాయి. పీఎంటీఏటీఎస్ సంఘం నేతలు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ను శుక్రవారం కలిసి నోటీసు అందజేశారు. మాడల్ స్కూళ్లను పాఠశాల విద్యలో విలీనంచేయాలని, పదోన్నతులు కల్పించాలని పీఎంటీఏ టీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు జగదీశ్, ప్రధాన కార్యదర్శి పోచయ్య నోటీసును అందజేశారు.