Telangana | ‘పది’ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి.. అధికారులను ఆదేశించిన మంత్రి సబితా ఇంద్రారెడ్డి
Telangana | హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలపై( Tenth Class Exams ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) సమీక్ష నిర్వహించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి, పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు.
Telangana | హైదరాబాద్ : ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలపై( Tenth Class Exams ) రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి( Minister Sabitha Indra Reddy ) సమీక్ష నిర్వహించారు. బషీర్బాగ్లోని తన కార్యాలయంలో సంబంధిత శాఖ అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించి, పది పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఆదేశించారు. పది విద్యార్థులకు సంబంధించిన హాల్ టికెట్లను( Hall Tickets ) ఈ నెల 24వ తేదీ నుంచి సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి తెలిపారు. ఆయా పాఠశాలలకు కూడా హాల్ టికెట్లు పంపుతామని చెప్పారు.
రాష్ట్ర వ్యాప్తంగా 4 లక్షల 94 వేల 616 మంది విద్యార్థులు పది పరీక్షలకు హాజరువుతున్నారని సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందుకోసం 2,652 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు మంత్రి పేర్కొన్నారు. త్వరలో డీఈవోలు,ఆయా జిల్లాల కలెక్టర్లు, ఎస్సీలు, ఇతర సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఏర్పాట్లపై సమీక్షించనున్నట్లు తెలిపారు. ఏప్రిల్ 3వ తేదీ నుండి 13వ తేదీ వరకు ప్రతీ రోజు ఉదయం 9:30 గంటల నుండి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యార్థులకు ఎలాంటి లోటు పాట్లు లేకుండా చూడాలని మంత్రి ఆదేశించారు. పరీక్ష కేంద్రాల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో విద్యా శాఖ కార్యదర్శి వాకాటి కరుణ, పాఠశాల విద్యా సంచాలకులు శ్రీదేవసేన, ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ కృష్ణారావు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

