హైదరాబాద్, డిసెంబర్ 22 (నమస్తే తెలంగాణ): ఎస్సీ వర్గీకరణపై కమిటీ వేసి, ఏబీసీడీ వర్గీకరణ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చుకుండా బీజేపీ మరోసారి మాదిగలను మోసం చేసిందని ఎమ్మార్పీఎస్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ మాదిగ ఆవేదన వ్యక్తం చేశారు. న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్లో శుక్రవారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. గత నెలలో తెలంగాణ మాదిగల విశ్వరూప మహాసభకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ.. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేసి వర్గీకరిస్తామని ఇచ్చిన హామీని ఈ పార్లమెంట్ సమావేశాల్లో నెరవేర్చలేదని అన్నారు.
కాంగ్రెస్ నేతలు వర్గీకరణ వ్యతిరేకులను పకన పెట్టుకొని మాదిగలను మోసం చేస్తున్నారని ధ్వజమెత్తారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు యాతాకుల భాసర్మాదిగ, చిలకమర్రి గణేశ్మాదిగ, హుస్సేన్ మాదిగ, కొల్లూరు వెంకట్ మాదిగ, వరిగడ్డి చందుమాదిగ, మారపాక నరేందర్మాదిగ, ఎల్ నాగరాజు మాదిగ తదితరులు పాల్గొన్నారు.