మిర్యాలగూడ, ఏప్రిల్ 7 : కాంగ్రెస్ మాదిగలకు తీరని అన్యాయం చేస్తున్నదని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ విమర్శించారు. రాష్ట్రంలో మాదిగలకు రిజర్వు అయిన లోక్‌సభ సీట్లను మాలలకు కేటాయించడం సరికాదన్నారు. ఆదివారం ఆయన మిర్యాలగూడలో మాట్లాడుతూ.. మాదిగలు కాంగ్రెస్‌ను ప్రధాన శత్రువుగా భావించాలని సూ చించారు.
బీసీలు సైతం కాంగ్రెస్‌ను నమ్మడం లేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ నాయకులు మాదిగ పల్లెల్లోకి వస్తే అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. తన రాజకీయ ఎదుగుదలకు మాదిగలే కారణమన్న సీఎం రేవంత్‌రెడ్డికి మాదిగలపై ప్రేమ లేదని విమర్శించారు.