నేడు ఢిల్లీలో ఎమ్మార్పీఎస్ ధర్నా

- పార్లమెంటు సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లు పెట్టాలి
- కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు భారీ ఆందోళన: వంగపల్లి
ముషీరాబాద్, డిసెంబర్ 12: ప్రస్తుత పార్లమెంటు సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణ బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్చేస్తూ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద ధర్నా చేపట్టనున్నట్టు ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ చెప్పారు. అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని ఇచ్చి న హామీ అమలుకోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి మాదిగ, మాదిగ ఉపకులాల నేతలు పెద్దఎత్తు న ఢిల్లీకి తరలుతున్నట్టు తెలిపారు. ఢిల్లీకి వెళ్లే ముందు ఆదివారం విద్యానగర్లోని ఆ సం ఘం కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. దళిత వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న బీజేపీ మెడలు వంచి వర్గీకరణ సాధించుకోవడమే లక్ష్యంగా మహాధర్నా చేపడుతున్నట్టు పే ర్కొన్నారు. 27 ఏండ్లుగా వర్గీకరణ కోసం ఉద్యమిస్తున్నా ప్రభుత్వాలు పట్టించుకోకుండా అవకాశవాద రాజకీయాలకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. సీఎం కేసీఆర్ ఎస్సీ వర్గీకరణకు అనుకూల ంగా లేఖ ఇచ్చినా కేంద్రం మొండివైఖరి అవలంబిస్తు ందని మండిపడ్డారు. సమావేశంలో ఎమ్మార్పీఎస్ నా యకులు శ్యామ్రావు, రమేశ్, కొల్లూరి వెంకట్, తిరుమలేశ్, శ్రీకాంత్, కిరణ్, సోమయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

