హైదరాబాద్ సిటీబ్యూరో, అక్టోబర్ 11(నమస్తే తెలంగాణ)/దుండిగల్: హైదరాబాద్ దుండిగల్‌లోని మర్రి లక్ష్మణ్‌రెడ్డి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(ఎంఎల్ఆర్ఐటీ)కి సొసైటీ ఆఫ్ ఆటోమోటివ్ ఇంజినీర్స్ (ఎస్‌ఏఈ)ఇండియా ఫౌండేషన్ 2021-22 అవార్డు లభించింది. న్యూఢిల్లీలో ఈ నెల 10న నిర్వహించిన అవార్డుల ప్రదానోత్సవంలో ఎంఎల్ఆర్ఐటీ ప్రిన్సిపాల్ డాక్టర్ కే శ్రీనివాస్‌రావు, మెకానికల్ విభాగం హెచ్‌వోడి ప్రొఫెసర్ ఎం వెంకటేశ్వర్ రెడ్డికి ఎస్ఏఇ ఇండియా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ డాక్టర్ శ్రీకాంత్ అవార్డును ప్రదానం చేశారు. ఈ సందర్భంగా కళాశాల సెక్రటరీ, బీఆర్ఎస్ పార్టీ మల్కాజిగిరి పార్లమెంట్ స్థానం ఇంఛార్జి మర్రి రాజశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ.. జాతీయ స్థాయిలో పోటీని తట్టుకొని ఎస్ఏఇ అవార్డు దక్కడం సంతోషంగా ఉన్నదన్నారు. ఈ అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని చెప్పారు. చైర్మన్ మర్రి లక్ష్మణ్‌రెడ్డి మాట్లాడుతూ.. కళాశాల అధ్యాపకులు, విభాగాధిపతుల కృషి ఫలితమే ఎస్ఏఇ అవార్డు అని పేర్కొన్నారు.