MLC Vijayashanti : తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ నరమేధం వ్యవహారంపై ఎమ్మెల్సీ విజయశాంతి (MLC Vijayashanti) కీలక వ్యాఖ్యలు చేశారు. అతికిరాతకంగా ఆరుగురిని కడతేర్చిన హంతకుడు రాజ్‌కుమార్ ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారని, కానీ.. పోక్సో కేసు(POCSO Case)లో అరెస్టైన నిందితుడు బెయిల్‌పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమనే ఆరోపణలు వస్తున్నాయని ఆమె ఎక్స్ పోస్ట్‌లో ధ్వజమెత్తారు.
షాబాద్‌లో ఆరుగురిని పొట్టనబెట్టుకున్న నిండుతుడు రాజ్‌కుమార్ బెయిల్‌పై బయటకు రాకపోయి ఉంటే ఆ ఆరుగురు ప్రాణాలతో ఉండేవారని విజయశాంతి అన్నారు. పోక్సో కేసులో అరెస్టైన రాజ్‌కుమార్ నుంచి లంచం తీసుకుని పోలీసులు అతడి విడుదలకు సహకరించారన్న సమాచారం పత్రికల ద్వారా తెలిసిన తర్వాత తెలంగాణలోని మహిళా లోకం షాక్‌కు గురవుతోంది. పోలీసులు చేసిన తప్పుతో ఆరుగురి ప్రాణాలను కడతేర్చడానికి ఆస్కారం ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతోందని ఎమ్మెల్సీ వెల్లడించారు.
తెలంగాణ రాష్ట్రంలో సంచలనం సృష్టించిన షాబాద్ నరమేధం వ్యవహారంలో హంతకుడు ఆత్మహత్య చేసుకోవడంతో ఈ కేసు ముగిసినట్లు పోలీసులు భావిస్తున్నారు. కానీ పోక్సో కేసులో అరెస్ట్ అయిన నిందితుడు బెయిల్ పై విడుదల కావడానికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని, pic.twitter.com/M51K2zicXN
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 13, 2026
రాష్ట్ర పోలీసు శాఖలోని ఇలాంటి లోపాల వల్ల తెలంగాణలో మహిళ భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉందని విజయశాంతి ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను సీరియస్‌గా పరిగణించి.. మహిళల భద్రతతో పాటు శాంతి, భద్రతల విషయంలో కఠినంగా వ్యవహారించాలని ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నానని విజయశాంతి విజ్ఞప్తి చేశారు.
నిండుతుడి నుంచి లంచం తీసుకుని పోలీసులు రాజ్ కుమార్ విడుదలకు సహకరించారన్న సమాచారం పత్రికల ద్వారా తెలిసిన తర్వాత తెలంగాణలోని మహిళా లోకం షాక్ కి గురవుతోంది. పోలీసులు చేసిన తప్పుతో ఆరుగురి ప్రాణాలను కడతేర్చడానికి ఆస్కారం ఏర్పడిందన్న అభిప్రాయం కలుగుతోంది.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 13, 2026
పోలీసు శాఖలోని ఇలాంటి లోపాల వల్ల తెలంగాణలో మహిళ భద్రతపై అనుమానాలు తలెత్తే ప్రమాదం ఉంది. మహిళలకు ప్రాధాన్యమిస్తామని చెబుతున్న కాంగ్రెస్ పాలనలో ఈ ఘటనను సీరియస్ గా పరిగణించి.. మహిళల భద్రతతో పాటు శాంతి, భద్రతల విషయంలో కఠినంగా వ్యవహారించాలని ఓ మహిళా ప్రజాప్రతినిధిగా కోరుకుంటున్నాను.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) July 13, 2026