కోర్టు ధికరణ కేసులో ముగిసిన విచారణ
హైదరాబాద్, నమస్తే తెలంగాణ : కోర్టు ధికరణ కేసులో సిద్దిపేట మాజీ కలెక్టర్, ఎమ్మెల్సీ పీ వెంకట్రామిరెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. కోర్టుల పట్ల గౌరవం ఉందని, కించపరిచేలా మాట్లాడలేదని, అంటూ, జరిగిన దానికి బేషరతుగా క్షమాపణ తెలియజేస్తూ వెంకట్రామిరెడ్డి అఫిడవిట్ దాఖలు చేశారు. దీంతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సతీశ్ చంద్రశర్మ, జస్టిస్ అభినంద్‌కుమార్ షావిలితో కూడినన ధర్మాసనం ఆయనపై దాఖలైన కోర్టుధికరణ వ్యాజ్యంపై విచారణ ముగిసినట్టు ప్రకటించింది. ‘వరి సాగు చేయరాదు. వరి విత్తనాలు విక్రయించినా, కోర్టు నుంచి ఉత్తర్వులు తెచ్చుకుని విక్రయించినా ఉపేక్షించేది లేదు. క్రిమినల్ కేసులు నమోదు చేస్తాం. దుకాణాలను సీజ్ చేస్తాం’ అని 2021 అక్టోబర్ 25న విత్తన డీలర్లు, వ్యవసాయాధికారుల సమావేశంలో సిద్దిపేట కలెక్టర్ హోదాలో వెంకట్రామిరెడ్డి మాట్లాడారు. దీనిని సుమోటోగా స్వీకరించి కోర్టు ధికరణగా పరిగణించిన హైకోర్టు ఆయనకు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే.