హనుమకొండ సిటీ, జనవరి 22: దవాఖానల్లో నాణ్యమైన వైద్య సేవలందించాలని ఎమ్మెల్సీ, రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. తెలంగాణ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్‌హోమ్స్ అసోసియేషన్ (థానా) 8వ రాష్ట్ర స్థాయి సదస్సు ఆదివారం హనుమకొండలోని ఓ గార్డెన్లో ప్రముఖ నేత్ర వైద్యనిపుణుడు పీ ప్రవీణ్‌కుమార్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ.. ప్రైవేట్ దవాఖానలు, నర్సింగ్ హోమ్‌ల సమస్యలను వైద్యారోగ్య శాఖ మంత్రితోపాటు సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చా రు. ఈ సందర్భంగా వరంగల్‌లోని క్యూర్వెల్ దవాఖాన నిర్వాహకుడు వీ రాకేశ్.. థానా రాష్ట్ర నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్‌భాస్కర్, ఎమ్మెల్సీ వాణీదేవి, టీఎస్ఎంసీ చైర్మన్ రాజలింగం, నగర మేయర్ గుండు సుధారాణి తదితరులు పాల్గొన్నారు.