హైదరాబాద్, ఏప్రిల్ 10 (నమస్తేతెలంగాణ): ఉద్యోగ, ఉపాధ్యాయులకు వెంటనే రిటైర్మెంట్ బెనిఫిట్స్ చెల్లించాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి గురువారం కలిసి విజ్ఞప్తిచేశారు.
బెనిఫిట్స్ అందక ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. కార్యక్రమంలో నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి, పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు గుండు లక్ష్మణ్, పుల్గం దామోదర్‌రెడ్డి తదితరులు ఉన్నారు.