హైదరాబాద్, సెప్టెంబర్ 7 (నమస్తే తెలంగాణ) : జీవో 98 వల్ల పాలిటెక్నిక్ విద్యార్థులు, బోధన సిబ్బంది ఆందోళనతో రోడ్లపైకి వచ్చారని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ శ్రీపాల్‌రెడ్డి అన్నారు. మండలిలో మాట్లాడుతూ.. ప్రతిష్టాత్మకమైన ఏఐసీటీ ఆధ్వర్యంలో ప్రొఫెషనల్స్‌ను తీర్చిదిద్దిన పాలిటెక్నిక్ కోర్సును కార్మికశాఖ పరిధిలోకి తీసుకురావడంతో ఆందోళన చెందుతున్నారని పేర్కొన్నారు. మంత్రి జీ వివేక్ స్పందిస్తూ.. దీనిపై విస్తృతమైన చర్చ చేపట్టి తుది నిర్ణయం తీసుకుందామని సూచించారు.