హైదరాబాద్, జూలై 27 (నమస్తే తెలంగాణ): ఆర్టీసీ బస్సుల సంఖ్యను పెంచాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ సత్యవతి రాథోడ్ ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. ఒకప్పుడు నల్లాల దగ్గర మహిళ మధ్య గొడవవలు జరిగేవని, కేసీఆర్ తెచ్చిన మిషన్ భగీరథతో అవి బంద్ అయ్యాయని చెప్పారు. ఇప్పుడు మహాలక్ష్మి పథకంతో బస్సుల్లో గొడవలు జరుగుతున్నాయని, దీంతో బస్సుల సంఖ్యను పెంచాలని, మారుమూల ప్రాంతాలకు కూడా నడుపాలని సత్యవతి రాథోడ్ కోరారు.
గత పదేండ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లోనూ దేశంలోనే ముందు వరుసలో నిలిచిందని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి కొనియాడారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టారని, 24 గంటలు ఉచిత విద్యుత్తు అందించారని గుర్తు చేశారు. వి నూత్న సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టారని చెప్పా రు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వీటన్నింటినీ విస్మరించి విమర్శించడం బాధాకరమని పేర్కొన్నారు.