హైదరాబాద్, నీలగిరి/కరీంనగర్ కలెక్టరేట్, ఫిబ్రవరి 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో రెండు ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్, ఒక టీచర్ ఎమ్మెల్సీ నియోజకవర్గాల్లో మొత్తం 192 నామినేషన్లు దాఖలైనట్టు సమాచారం. త్వరలో పూర్తి వివరాలు తెలియజేస్తామని తెలంగాణ సీఈవో సుదర్శన్‌రెడ్డి తెలిపారు. మంగళవారం నామినేషన్ల స్క్రూటినీ ప్రక్రియ నిర్వహించారు. నామినేషన్లు ఉపసంహరించుకోవడానికి ఈ నెల 13 వరకు గడువు ఉంది. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల వివరాలు స్పష్టంగా తెలియనుంది. ఈ నెల 27న పోలింగ్ నిర్వహించనున్నారు. ఇప్పటికే అభ్యర్థులు జోరుగా ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం 34 నామినేషన్లు తిరస్కరణకు గురైనట్టు ఎన్నికల అధికారులు ప్రకటించారు.