హైదరాబాద్, డిసెంబర్ 17 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర మంత్రివర్గంలో మైనార్టీ మంత్రి లేరు. మైనార్టీల సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో ప్రజలకు అర్థం కావడం లేదని ఎమ్మెల్సీ మహమూద్ అలీ పేర్కొన్నారు. శాసనమండలిలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ‘ప్రభుత్వంలో ఇద్దరు మైనార్టీలకు మంత్రి పదవులు ఇస్తామని చెప్పారు.. ఏడాదవుతున్నా మైనార్టీ శాఖకు ఒక్క మంత్రి లేడు. మైనార్టీ శాఖకు మంత్రిని వెంటనే నియమించాలి’ అంటూ డిమాండ్ చేశారు.