హైదరాబాద్, డిసెంబర్ 16 (నమస్తే తెలంగాణ): తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప దార్శనికుడని, నేటి పాలకులు ఆయన ను ఆదర్శంగా తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ మధుసూదనాచారి హితవు పలికారు. శనివారం మండలిలో గవర్నర్ ప్రసంగంపై చర్చ సందర్భంగా మాట్లాడారు. తాయిలాలు ప్రకటించి ఓట్లు వే యించుకోవడం కాంగ్రెస్ పాలకుల విధానమ ని, దీనికి భిన్నంగా కేసీఆర్ అనాదిగా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు కృషిచేశారని కొనియాడారు. తరతరాలుగా వస్తున్న సమస్యలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పరిష్కరించలేకపోయాయ ని విమర్శించారు. కేసీఆర్ తన పాలనలో ఎటువంటి పక్షపాతం చూపలేదని, అప్పటి విపక్ష సభ్యుడు, నేటి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్గ నియోజకవర్గంలోని ఒక మండలంలో దళితబంధును అమలుచేయడమే ఇందుకు నిదర్శనమన్నారు.