హైదారాబాద్ : ఈ నెల 28వ తేదీన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha) మధ్యప్రదేశ్(Madhya Pradesh )రాష్ట్రంలో పర్యటించనున్నారు. మధ్యప్రదేశ్ ఓబీసీ హక్కలు ఫ్రంట్ ఆధ్వర్యంలో జరగబోయే యాత్రకు ముఖ్య అతిథిగా హాజరువుతారు. ఫ్రంట్ వ్యవస్థానకుడు, ప్రముఖ బీసీ నాయకుడు దామోదర్ సింగ్ యాదవ్ చేపట్టబోయే ‘పీడిత్ అధికార్ యాత్ర’ను(Peedith adhikaar Yathra) ఆ రాష్ట్రంలోని దాతియా పట్టణంలో ఎమ్మెల్సీ కవిత ప్రారంభిస్తారు.
ఓబీసీ హక్కల కోసం పోరాటం చేస్తున్న దామోదర్ సింగ్ యాదవ్(Damodar Singh Yadav)కు మద్ధతుగా కవిత అక్కడి ప్రజానికాన్ని ఉద్దేశించి ప్రసంగిస్తారు. అనేక సంవత్సరాలుగా ఓబీసీల హక్కలు, డిమాండ్ల సాధన కోసం మధ్ప్రదేశ్ కేంద్రంలో దామోదర్ సింగ్ యాదవ్ పోరాటాన్ని కొనసాగిస్తున్నారు.