వేములవాడ: మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా వేములవాడ శ్రీరాజరాజేశ్వర స్వామివారిని ఎమ్మెల్సీ కవిత (Kavitha) దర్శించుకున్నారు. బుధవారం వేకువజామున మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్తో కలిసి ఆలయానికి చేరుకున్న కవిత ఎములాడ రాజన్నకు ప్రత్యేక పూజలు చేశారు. మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం వారికి ఆలయ అర్చకులు వేదాశీర్వచనం అందించారు. కవిత వెంట వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మడ లక్ష్మీనరసింహారావు, జిల్లా పార్టీ అధ్యక్షుడు తోట ఆగయ్య, జిల్లా పరిషత్ మాజీ చైర్ పర్సన్లు తుల ఉమా, న్యాలకొండ అరుణ , ద్యావ వసంత, టీజీపీఎస్సీ మాజీ కార్యదర్శి సుమిత్ర ఆనంద్ ఉన్నారు. అంతకుముందు ఆలయానికి వచ్చి కవితకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.