హైదరాబాద్ : సోదర సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పండుగ సంబురాలు అంబరాన్నంటాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఇళ్లల్లో రాఖీ పండుగ సందడి మొదలైంది. సోదరీమణులందరూ తమ సోదరులకు రాఖీ కట్టి ఆశీర్వచనాలు తీసుకుంటున్నారు.
ఈ క్రమంలో ప్రగతి భవన్లో జరిగిన రక్షాబంధన్ వేడుకల్లో ఎమ్మెల్సీ కవిత పాల్గొన్నారు. తన సోదరుడు, మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ఎమ్మెల్సీ కవిత రాఖీ కట్టి ఆశీర్వాదాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికి ఎమ్మెల్సీ కవిత రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు.