హైదారాబాద్: ఈ వారాంతంలో హైదారాబాద్ దగ్గరలోని హార్ట్ఫుల్నెస్ ప్రధానకేంద్రమైన పచ్చని కాన్హా శాంతి వనంలో హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ [HET], ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ [AICTE] భాగస్వామ్యంతో ‘నేషనల్ హ్యాపీనెస్ యూనికార్న్’ అవార్డుల ప్రదానోత్సవం జరిగింది. ఈ సమావేశానికి సుమారు 10000 మంది హాజరయ్యారు; 150 దేశాలనుండి కొన్ని వేలమంది వర్చ్యువల్‌గా పాలుపంచుకొన్నారు. హార్ట్ఫుల్నెస్ ఎడ్యుకేషన్ ట్రస్ట్, మరియు ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు, ‘హార్ట్‌ఫుల్ కాంపస్’ మరియు ‘యువర్ వన్ లైఫ్’ లతో కలిసి ఈ అవార్డుల విజేతలను నిర్ణయించారు.
దేశస్థాయిలో ఆనందకరమైన సంస్థలను గుర్తించే దిశలో ఇవి ప్రప్రథమ అవార్డులు కావడం గమనార్హం. సభకు నిజామాబాద్ ఎమ్మెల్సీ కవిత, శ్రీ రామచంద్ర మిషన్ అధ్యక్షులు, హెచ్ఈటీ వ్యవస్థాపకులు కమలేష్ పటేల్ [దాజీ], ఏఐసీటీఈ ఛైర్మన్ అనిల్ సహస్రబుద్ధి, ఇంకా ‘యువర్ వన్ లైఫ్’కు సృష్టికర్త యోగి కోచార్ ఈ సమావేశంలో పాల్గొన్నారు. వివిధ సంస్థల నుండి పలువురు వైస్-చాన్సలర్లు, డైరెక్టర్లు, భారతదేశంలోని అన్ని రాష్ట్రాలనుండి ప్రతినిధులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. “ తెలంగాణ పరిస్థితులను తట్టుకొని నిలబడుతోంది. ఈ సమయంలో రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను, తలసరి ఆదాయ అవసరాలను సమర్దించగల బలమైన వ్యవస్థను ఏర్పరచుకోవాలని గుర్తించడం జరిగింది. ఈ దిశగా, హార్ట్ఫుల్నెస్ మరియు హ్యాపీనెస్ [ఆనందం] యొక్క ప్రాముఖ్యతను, అవి అందించగల బలమైన పునాదిని కూడా మేము గుర్తించాము. తెలంగాణ హృదయం ఆనంద నాదానికి నాట్యం చేయాలి. ఈ కార్యక్రమాన్ని మేము కేవలం తెలంగాణ వరకే సమర్ధించడం లేదు; HET, AICTE, ‘యువర్ వన్ లైఫ్’, ఇంకా FSFTI ల సహకారంతో ఇది భారతదేశం మొత్తాన్నీ ప్రభావితం చేయగలదు.” అన్నారు.
మైక్రోసాఫ్ట్ మాజీ టీం-లీడర్ యోగి కోచర్ తయారు చేసిన అద్భుతమైన యాప్ ‘యువర్ వన్ లైఫ్’. హెచ్ఈటీ, ‘యువర్ వన్ లైఫ్’ మధ్య ఇటీవలే ఒక అవగాహన ఒప్పందం జరిగింది. దీని ప్రకారం ‘యువర్ వన్ లైఫ్’ లోని 12 భాగాలలో ఒకటైన ‘మనస్సాక్షి ] యాప్ ను హార్ట్ఫుల్నెస్ సంస్థవారు తమ నైపుణ్యంతో, నవీకరణతో నిర్వహిస్తారు. ఉన్నత విద్యానియంత్రణ సంస్థ ఐన ఏఐసీటీఈ, తమ ఆధ్వర్యంలో ఉన్న 9000 విద్యాసంస్థలు, వాటిలోని 7 లక్షల మంది విద్యార్థులను ప్రభావితం చేసేందుకు కృషి చేస్తుంది. హెచ్ఈటీ, ఏఐసీటీఈల మధ్య జరిగిన మరో ఒప్పందం ప్రకారం ఏఐసీటీఈ విద్యార్థులకు హెచ్ఈటీకి సంబంధించిన జ్ఞాన వనరులకు ప్రవేశం లభిస్తుంది.

తెలంగాణకు చెందిన ముఫకమ్ జా కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ & టెక్నాలజీ, సెయింట్ మార్టిన్ & సెయింట్ మేరీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ కు హార్ట్ఫుల్నెస్ అవార్డులు లభించాయి. ఇవే కాకుండా లవ్లీ ప్రొఫెషనల్ యూనివెర్సిటీ [పంజాబ్], మనిపాల్ యూనివర్సిటీ జైపూర్ [రాజస్థాన్], జైపూరియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ [రాజస్థాన్], ఆర్యన్స్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ [చండీఘర్], మణిపుర్ యూనివెర్సిటీ, SGT యూనివెర్సిటీ (హర్యానా),
సిక్కిం మణిపాల్ యూనివెర్సిటీ [సిక్కిం], కేఐఈటీ గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ (ఘజియాబాద్); నేతాజీ సుభాష్ చంద్ర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఢిల్లీ); వెలమ్మాళ్ ఇంజినీరింగ్ కాలేజ్ [తమిళనాడు], మర్ బసెలస్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ & సైన్స్ [కేరళ], JSS అకాడెమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ & రీసెర్చ్ (కర్ణాటక), కలశలింగం ఆకాడెమి ఆఫ్ రీసెర్చ్ & ఎడ్యుకేషన్ (తమిళనాడు), ఆమృత్సర్ గ్రూప్ ఆఫ్ కాలేజెస్ [పంజాబ్], అంబాలిక ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ & టెక్నాలజీ [యు.పి], భారతి విద్యాపీఠ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మానేజ్మెంట్ స్టడీస్ & రీసెర్చ్ [మహారాష్ట్ర], టెక్నియ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అద్వాన్స్డ్ స్టడీస్ [ఢిల్లీ], లక్ష్మీనారాయన్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ (మధ్యప్రదేశ్) తదితర సంస్థలకు కూడా అవార్డులు దక్కాయి.