MLC Kavitha | తక్షణమే కులగణన ప్రక్రియను ప్రారంభించాలి : ఎమ్మెల్సీ కవిత
MLC Kavitha | కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన(Caste census) చేపట్టే ప్రక్రియను మొదలు పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు.
వికారాబాద్: ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం తక్షణమే కులగణన(Caste census) చేపట్టే ప్రక్రియను మొదలు పెట్టాలని భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత(MLC Kavitha )డిమాండ్ చేశారు. ఇప్పుడు ప్రక్రియ మొదలుపెడితేనే ఆరు నెలల్లో కులగణనను పూర్తి చేయగలరని అన్నారు. కులగణను పూర్తి చేసి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను కల్పించిన తర్వాతే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు.
రిజర్వేషన్లను 42 శాతానికి పెంచితే స్థానిక సంస్థల్లో దాదాపు 24 వేల మంది బీసీలు ప్రజాప్రతినిధులు అవుతారని కాంగ్రెస్ పార్టీయే చెప్పిందని గుర్తు చేశారు. బీసీ హక్కుల సాధన కోసం బుధవారం వికారాబాద్ జిల్లా కేంద్రంలో భారత జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్(Mahatma Jyothi Rao Phule) సంయుక్తగా నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశానికి కవిత ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..బ్రిటిషర్స్ హయాంలో 1931లో చివరి సారి కులగణన జరిగిందని, అప్పుడు 4300 పైగా బీసీ కులాలు ఉన్నాయని తేలిందన్నారు. కానీ ఇప్పటి ప్రభుత్వాలు మాత్రం దేశంలో కేవలం దాదాపు 2400 బీసీ కులాలు ఉన్నాయని అంటున్నాయని, బీసీ కులాల సంఖ్యపైనే స్పష్టత లేక అయోమయ పరిస్థితుల నేపథ్యంలో కులగణన చాలా అవసరమని నొక్కి చెప్పారు.
రూ. 20 వేల కోట్లు కేటాయించాలి
అలాగే, బీసీల సంక్షేమ కోసం ప్రతి ఏటా రూ. 20 వేల కోట్ల చొప్పున ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు బడ్జెట్ కేటాయిస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిందని, కాబట్టి ఈ 2024-25 బడ్జెట్ లో ప్రభుత్వం రూ. 20 వేల కోట్లు కేటాయించాలని అన్నారు. లేదంటే బీసీలు ఈ ఏడాది రూ. 20 వేల కోట్లు కోల్పోయే ప్రమాదం ఉందని తెలిపారు. అసెంబ్లీ ఆవరణలో అంబేడ్కర్ విగ్రహం ఏర్పాటు చేయాలని తాము డిమాండ్ చేసి సాధించినప్పుడు దళిత సంఘాలు సంతోషించాయని, ఇప్పుడు కూడా పూలే విగ్రహ ప్రతిష్టాపన సాధన కోసం అందరు కలిసి రావాలని పిలుపునిచ్చారు.
పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో ఏర్పాటుపై ఏప్రిల్ 11లోగా ప్రభుత్వం సానుకూల ప్రకటన చేయాలని అల్టిమేటం జారీ చేశారు. పూలే విగ్రహ సాధన కోసం ఈ నెల 12వ తేదీన హైదరాబాద్ లో మహాధర్నా నిర్వహించబోతున్నామని, రాజస్థాన్, ఉత్తర ప్రదేశ్, మధ్య ప్రదేశ్, మహారాష్ట్ర వంటి నుంచి రాజకీయాలకు అతీతంగా ప్రతినిధులను ఆహ్వానిస్తున్నామని పేర్కొన్నారు.
రిజర్వేషన్లపై గళమెత్తాలి
2018 నుంచి ఇప్పటి వరకు 4365 మంది సివిల్స్ కు ఎంపికైతే అందులో కేవలం 1195 మాత్రమే బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నాయని లేవనెత్తారు. ఓబీసీలకు 27 శాతం రిజర్వేషన్లు ఉన్నా కూడా కేవలం 15.5 శాతం మందిని మాత్రమే ఎంపిక చేశారని చెప్పారు. ఎస్సీలు 5 శాతం, ఎస్టీలు కేవలం 3 శాతం మాత్రమే ఎంపికయ్యారని వివరించారు. వెనుకబడిన వర్గాలు కోల్పోతున్న రిజర్వేషన్లపై ఎవరూ మాట్లాడడం లేదని, కాబట్టి బీసీ మేధావులు ఈ అంశంపై గళమెత్తాలని పిలుపునిచ్చారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల రూ. 26 లక్షల కోట్లతో ప్రవేశపెట్టిన బడ్జెట్ లో బీసీలకు కేవలం రూ. 5 వేల కోట్లు మాత్రమే కేటాయించిందని విమర్శించారు. భారత జాగృతిగా రూపాంతరం చెందిన తెలంగాణ జాగృతి అనేక సామాజిక అంశాలపై పోరాటాలు చేసిందని చెప్పారు. రౌండ్ టేబుల్ సమావేశంలో యునైటెడ్ పూలే ఫ్రంట్ కన్వీనర్ గట్టు రామచందర్ రావు, నాయకులు బొల్ల శివశంకర్, ఏల్చల దత్తాత్రయ, తాడూరి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Sai Pallavi | మాటల విషయంలో తప్పు తెలుసుకున్న సాయిపల్లవి.. ఇకపై ఆచితూచి మాట్లాడతానంటూ కీలక వ్యాఖ్యలు!
Qeshm Island: ఇరాన్‌లోని ఖాసిం దీవిపై అమెరికా అటాక్
డాలస్‌లో ఘనంగా కొసరాజు సాహిత్య సంపుటాల ఆవిష్కరణ
Sai Durga Tej | మెగా ఫ్యామిలీలో పెళ్లి సందడి.. త్వరలో సాయి దుర్గా తేజ్ నిశ్చితార్థం,పెళ్లి తేదీ కూడా ఖరారైందా?
AP News | ఏపీలో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు.. రాత్రి 8 గంటలకల్లా పూర్తి ఫలితాలు ప్రకటించేలా ఏర్పాట్లు
ట్రెండింగ్ వార్తలు
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్

