MLC Kavitha | బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత, మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు
MLC Kavitha | ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్లో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు.
హైదరాబాద్ : ఆషాడ బోనాల సందర్భంగా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ( MLC Kavitha ) ఆదివారం మొండా మార్కెట్ డివిజన్ ఆదయ్య నగర్లో నిర్వహించిన పూజలలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ (Minister Talasani) ఆధ్వర్యంలో డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్, అర్చకులు ఎమ్మెల్సీకి స్వాగతం పలికారు . పూజా కార్యక్రమాలు అనంతరం ఎమ్మెల్సీ కవిత బోనాలు( Bonalu) ఎత్తుకున్నారు. ఆలయ అర్చకులు, బీఆర్ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కవితను పూలమాతో సత్కరించి సన్మానించారు.


మహంకాళి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి దంపతులు
సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల ఉత్సవాల సందర్భంగా దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy ) దంపతులు ఆదివారం హాజరై అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. మంత్రి కుటుంబ సభ్యులు అమ్మవారికి బోనం సమర్పించి, పూజలు నిర్వహించారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

