IT hub nizamabad | నిజామాబాద్ జిల్లాలో నిర్మిస్తున్న ఐటీ హబ్ భవన పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత( MLC Kavitha ) శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా IT hub nizamabad వెబ్ సైట్‌ను ఎమ్మెల్సీ కవిత ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా( MLA Ganesh Gupta ), బీఆర్ఎస్ ఎన్నారై గ్లోబల్ కన్వీనర్ బిగాల మహేశ్ గుప్తా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ.. ఇందూరులో పరిశ్రమల అభివృద్ధికి ఐటీ హబ్ ఒక ఆరంభం లాంటిందన్నారు. ఇంకా ఎన్నో పరిశ్రమలు నిజామాబాద్‌కు రానున్నాయని తెలిపారు. నిజామాబాద్‌లో ఐటీ హబ్ నిర్మాణానికి ఎంతో శ్రద్ద తీసుకున్న సీఎం కేసీఆర్, కేటీఆర్‌కు ఎమ్మెల్సీ కవిత ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. యువతకు ఉపాధి కల్పన లక్ష్యంగా చేపట్టిన ఐటీ హబ్ పనులు తుది దశకు చేరుకున్నాయి. త్వరలోనే ఐటీ హబ్‌ను కేటీఆర్ చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. రూ. 50 కోట్ల వ్యయంతో చేపట్టిన ఐటీ హబ్‌లో 750 మంది యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామన్నారు.