నేడు కాలినడకన తిరుమలకు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 16 : సీఎం కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకొని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం హైదరాబాద్లోని నివాసంలో ‘గిఫ్ట్ ఏ స్మైల్’ కార్యక్రమం కింద పలువురు దివ్యాంగులకు ఎలక్ట్రిక్ ట్రై స్కూటర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో దివ్యాంగులకు రూ. 500 మాత్రమే పెన్షన్ ఇవ్వగా, కేసీఆర్ అధికారంలోకి వచ్చాక రూ.3016కు పెంచారని గుర్తుచేశారు. దివ్యాంగుల అభ్యున్నతికోసం అనేక సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నారని వివరించారు. కేసీఆర్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కవిత గురువారం కాలినడకన వెళ్లి శ్రీవారిని దర్శించుకోనున్నారు. మధ్యాహ్నం మెట్లమార్గంలో కొబ్బరికాయ కొట్టి నడక ప్రారంభించి.. సాయంత్రానికి కొండమీదకు చేరుకోనున్నారు. అనంతరం వేంకటేశ్వరస్వామిని దర్శించుకోనున్నారు.