MLC Kavitha | హైదరాబాద్ : ఫార్ములా ఈ కేసులో ఈ నెల 16న ఉదయం 10 గంటలకు విచారణకు హాజరు కావాలని ఏసీబీ అధికారులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నోటీసులపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత స్పందించారు.
రాజకీయ కక్ష సాధింపులో భాగంగా మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు కాంగ్రెస్ సర్కార్ మళ్ళీ నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని కవిత పేర్కొన్నారు. మీరు ఎన్ని కుట్రలు పన్నినా మీ వైఫల్యాలను ప్రజా క్షేత్రంలో ఎండగడుతూనే ఉంటాం అని కవిత స్పష్టం చేశారు. చివరగా జై తెలంగాణ జై కేసీఆర్ అని నినదించారు.