హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): భారత జాగృతి దీక్ష కార్యక్రమానికి అనుమతి ఇవ్వాలని డీజీపీ రవిగుప్తాను భారత జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత కోరారు. ఈ విషయమై కవిత బుధవారం డీజీపీతో ఫోన్లో మాట్లాడారు. ప్రభుత్వ నియామకాల్లో జీవో-3 వల్ల మహిళలకు రిజర్వేషన్ అమలులో జరుగుతున్న అన్యాయంపై ఈ నెల 8న ధర్నా తలపెట్టినట్టు ఆమె తెలిపారు. ఇది చాలా ముఖ్యమైన అంశమని స్పష్టం చేశారు. తాము శాంతియుతంగానే దీక్ష నిర్వహిస్తామని కవిత డీజీపీకి తెలియజేశారు.