హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): బూటకపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగడుగునా ప్రశ్నించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం నందినగర్‌లోని తన నివాసంలో ఆదిలాబాద్, రంగారెడ్డి జిల్లాలకు చెందిన జాగృతి నాయకులతో ఆమె సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ అధికారం కోసం రాహుల్‌గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ తప్పుడు హామీలిచ్చారని మండిపడ్డారు. యువవికాసం కింద విద్యార్థులకు రూ. 5లక్షల విద్యాభరోసా కార్డులిస్తామని చెప్పి ఓట్లు దండుకొని ఇప్పుడు ఆ ఊసే ఎత్తడంలేదని ధ్వజమెత్తారు. రూ. 3లక్షల్లోపు ఆదాయం ఉన్న బీసీ కుటుంబాల పిల్లలకు 100 శాతం ఫీజు రీయింబర్స్మెంట్ ఇస్తామని చెప్పి దగా చేశారని విరుచుకుపడ్డారు. మహిళలకు నెలకు రూ. 2500 ఇస్తామని చెప్పిన రేవంత్‌రెడ్డి ఇప్పుడు ఆ మాటే మరిచిపోయారని విమర్శించారు. 18 ఏండ్లు నిండిన విద్యార్థినులకు స్కూటీలు కొనిస్తామని ఇచ్చిన హామీని గాలికొదిలేసిందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం హామీల అమలుపై స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు.
హైదరాబాద్, డిసెంబర్6 (నమస్తే తెలంగాణ): కుమ్రంభీం ఆసిఫాబాద్ జి ల్లా వాంకిడి గురుకుల పాఠశాలలో ఫుడ్‌పాయిజన్ కారణంగా మృతిచెందిన శైల జ కుటుంబానికి తెలంగాణ జాగృతి అం డగా నిలిచింది. బాధిత కుటుంబానికి శుక్రవారం జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మె ల్సీ కవిత రూ. 2 లక్షల ఆర్థిక సాయం ప్ర కటించారు. శైలజ కుటుంబం దయనీయ పరిస్థితిని ఆసిఫాబాద్ జిల్లా జాగృతి నాయకుడు పార్శ చంద్రశేఖర్ ఎమ్మెల్సీ కవిత దృష్టికి తీసుకెళ్లారు. దీంతో శైలజ కుటుంబానికి రూ. 2లక్షలు అం దించాలని ఆమె నిర్ణయించారు. అలాగే త్వరలోనే వాంకిడిలో పర్యటిస్తానని పే ర్కొన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కవిత డిమాండ్ చేశారు. ఇంటిని నిర్మించి ఇవ్వడంతో పాటు బాధి త కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు.