హైదరాబాద్, ఫిబ్రవరి 19 (నమస్తే తెలంగాణ): ముంబైలో 25న జరుగనున్న ‘ఐడియాస్ ఆఫ్ ఇండియా సమ్మిట్-2023’కు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత హాజరుకానున్నారు. ‘2024 ఎన్నికలు-విపక్షాల వ్యూహం’ అనే అంశంపై జరుగనున్న చర్చలో కవిత తన అభిప్రాయాలను పంచుకుంటారు. బీఆర్ఎస్ జాతీయ ఎజెండా, దేశాభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఆలోచనలు, దేశానికే ఆదర్శంగా నిలిచిన రైతుబంధు, దళితబంధు, రైతు బీమా వంటి పథకాల ప్రాముఖ్యత గురించి ఈ వేదిక ద్వారా కవిత వివరిస్తారు. ఆమెతో పాటు శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది, ఆప్ ఎంపీ రాఘవ చద్దా, తృణముల్ కాంగ్రెస్ ఎంపీ సుష్మితాదేవ్ పాల్గొంటారు.