హైదరాబాద్, మార్చి17 (నమస్తే తెలంగాణ ) : విద్య, ఉద్యోగ, రాజకీయాల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ప్రతిపాదిస్తూ ప్రభుత్వం అసెంబ్లీలో వేర్వేరు బిల్లులు పెట్టడం తెలంగాణ జాగృతి విజయమని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. అంతిమ లక్ష్యం చేరేవరకు విశ్రమించకుండా పోరాడాలని బీసీలకు పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్లోని సెంట్రల్కోర్టులో జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ నేతల సమావేశంలో ఆమె మాట్లాడారు. సబ్బండ వర్గాలకు తెలంగాణ జాగృతి ఎల్లప్పుడూ అండగా ఉంటుందని చెప్పారు. ఈ ఉద్యమానికి సహకరించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత బీసీ ఉద్యమ పాటను ఆవిష్కరించారు.