Mlc Elections | ఎమ్మెల్సీ ఎన్నికల నిర్వహణ సజావుగా నిర్వహించాలి : జోగులాంబ గద్వాల కలెక్టర్
Mlc Elections | మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల (jogulamba district) జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు.
Mlc Elections | జోగులాంబ గద్వాల : మహబూబ్ నగర్, రంగా రెడ్డి, హైదరాబాద్ టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అధికారులు పొరపాట్లకు తావివ్వకుండా సజావుగా నిర్వహించాలని జోగులాంబ గద్వాల (jogulamba district) జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అన్నారు. గద్వాల జిల్లా కేంద్రంలో శుక్రవారం కలెక్టరేట్ సమావేశం మందిరంలో ఎన్నికల ప్రిసైడింగ్ , అసిస్టెంట్ ప్రిసైడింగ్ , మైక్రో అబ్జర్వర్లలతో నిర్వహించిన శిక్షణ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల పాత్ర ముఖ్యమని అన్నారు.
అధికారులు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి , సహాయ రిటర్నింగ్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ పని చేయాలని సూచించారు. జిల్లాలో 877 మంది ఓటర్లు(Voters) ఉన్నారని వెల్లడించారు. జిల్లాలో 11 పోలింగ్ స్టేషన్ల(Polling stations)ను ఏర్పాటు చేశామని, 13 మంది ప్రిసైడింగ్ అధికారులు , 13 మంది అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు , 12 మంది మైక్రో అబ్జర్వర్లు , ఆరుగు సెక్టోరియల్ అధికారులను నియమించామని పేర్కొన్నారు. ఈ నెల 12 న ఎన్నికల సామగ్రీతో రూట్ వారీగా వెళ్లాలని వివరించారు.
ఈ నెల 13 న ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉంటుందని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా ఓటు 1,2,3,4 ప్రకారంగా ప్రిపరేన్సు ఓటు వేయవచ్చన్నారు. బ్యాలెట్ పేపర్, డిస్ట్రిబ్యూషన్ కేంద్రాల ఏర్పాటు , పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలట్ బాక్సులు రిసిప్షన్ కేంద్రానికి చేరే వరకు పూర్తి బాధ్యత వహించాలని ఆదేశించారు. సమావేశంలో అదనపు కలెక్టర్ అపుర్వ్ చౌహాన్, సూపరింటెండెంట్ వరలక్ష్మి, జిల్లా నోడల్ అధికారులు వెంకటేశ్వర్లు, శ్రీధర్ రెడ్డి, రమేశ్ బాబు తదితరులు పాల్గొన్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

