MLC Elections | హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఫిబ్రవరి 27 జరిగిన రెండు ఉపాధ్యాయ, ఒక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల కౌంటింగ్ నేడు జరుగనున్నది. ఇందుకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసినట్టు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్‌రెడ్డి తెలిపారు. ఉమ్మడి కరీంనగర్-ఆదిలాబాద్-నిజామాబాద్-మెదక్ ఉపాధ్యాయ, పట్టభద్రుల నియోజకవర్గాలకు సంబంధించి పోలైన ఓట్ల లెక్కింపునకు కరీంనగర్‌లోని ఇండోర్ స్టేడియంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. ఉమ్మడి నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి పోలైన ఓట్ల లెక్కింపునకు నల్లగొండలోని గిడ్డంగుల కార్పొరేషన్లో ఏర్పాట్లు పూర్తయ్యా యి.
కరీంనగర్ గ్రాడ్యుయేట్ల ఓట్ల లెక్కింపునకు 22 టేబుళ్లు, ఉపాధ్యా య ఓట్ల లెక్కింపునకు 14 టేబుళ్లు, నల్లగొండ ఉపాధ్యాయ ఓట్ల లెక్కింపునకు 25 టేబుళ్లు ఏర్పాటుచేశారు. ఉద యం 8 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది. ప్రతి కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక సూపర్వైజర్, ఇద్దరు అసిస్టెంట్లను నియమించారు. కౌంటిం గ్ కోసం సిబ్బందిని 3 షిఫ్ట్‌లుగా ఏర్పాటుచేశారు. వెబ్‌క్యాస్టింగ్ ద్వారా కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనున్నది. ఆదివారం మాక్ కౌంటింగ్ పూర్తయినట్టు సీఈవో తెలిపారు.
నేడు ఎమ్మెల్యే కోటా ‘ఎమ్మెల్సీ’ నోటిఫికేషన్ ; 10 వరకు నామినేషన్ల గడువు.. 20న పోలింగ్
హైదరాబాద్, మార్చి 2 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల నోటిఫికేషన్ నేడు విడుదల కానున్నది. సోమవారం నుంచే నామినేషన్లు స్వీకరించనున్నారు. ఈ నెల 10 వరకు నామినేషన్ల దాఖలుకు గడువు ఇవ్వగా, 11న తనిఖీలు చేస్తారు. ఉపసంహరణకు 13 వరకు గడువు విధించారు. 20న పోలింగ్ జరుగనున్నది. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ ఉండనున్నది. అదే రోజు సాయంత్రం 5 గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభం కానున్నది.